Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshఈ నెల 11న జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి*

ఈ నెల 11న జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి*

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
* పూలే జయంతి రాష్ట్ర పండుగగా అధికారిక నిర్వహణ
* విజయవాడలో రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవం నిర్వహణ : మంత్రి సవిత

ఈ నెల 11న బడుగుల ఆశాజ్యోతి మహ్మత్మా జ్యోతిరావు పూలే ద్విశతబ్ది జయంతి ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జ్యోతిరావు పూలే జయంతిని రాష్ట్ర పండుగగా, అధికారికంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పూలే జయంత్యోత్సవం నిర్వహించనున్నామన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా విద్య, దళిత, బడుగు వర్గాల హక్కుల కోసం, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడిన యోధుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కోసం జీవితాన్ని ధారపోశారన్నారు. తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి 1848లో పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారన్నారు. ఈ నెల 11న మహత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ధి జయంతిని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జ్యోతిరావు పూలే జయంతిని రాష్ట్ర పండుగగా, అధికారికంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి పూలే జయంత్యోత్సవం నిర్వహించనున్నామని మంత్రి సవిత తెలిపారు. అంతకుముందు ఏలూరు జిల్లా హనుమాన్ జంక్షన్ కు చెందిన శిల్ప కళాకారులు రూపొందించిన జ్యోతిరావు పూలే విగ్రహ నమూనాలను తన క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత పరిశీలించారు. వాటిని రూపొందించిన కళాకారులను మంత్రి అభినందించారు. ఈ సమావేశంలో పలువురు కార్పొరేషన్ చైర్మన్లు నందం అబద్ధయ్య, మల్లె ఈశ్వరరావు, ఎర్రిబోతు రమణరావు, వీరంకి గురుముర్తి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments