Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshమంత్రి కు సహకారకేంద్ర బ్యాంక్ చైర్మన్ వినతి

మంత్రి కు సహకారకేంద్ర బ్యాంక్ చైర్మన్ వినతి

కాకినాడ సహకార కేంద్ర బ్యాంకు షేర్ క్యాపిటల్ అసిస్టెంట్ ద్వారా ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయాలని ఇన్చార్జ్ మంత్రి నారాయణకు వినతి పత్రం అందజేసిన ఉమ్మడి తూర్పుగోదావరి సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఇంచార్జ్ మంత్రి పురపాల శాఖ మంత్రి పొంగూరి నారాయణ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బడ్జెట్ అవుట్ రిచ్ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా మంత్రి ని కలిసి సహకార కేంద్ర బ్యాంక్ షేర్ కాపిటల్ అసిస్టెంట్ 200.00 కోట్లు మొత్తము వడ్డీ లేని రుణములు రాయితీ 44.69 కోట్ల మొత్తము 6% ఇంట్రెస్ట్ రాబిట్ 15.92 మొత్తము మరియు 397 లబ్ధిదారులకు టిట్కో అప్పులపై రావాల్సిన 3.34 కోట్లు వడ్డీ మొత్తం ప్రభుత్వం వారి నుండి ఇవ్వాలని వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై మంత్రి నారాయణ సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి మరియు సహకార మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి సీఈవో ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments