Home Politics Andhra Pradesh థాంక్యూ సిఎం సార్

థాంక్యూ సిఎం సార్

0

ఏపీ 108 అంబులెన్స్ సర్వీస్ లో పనిచేస్తున్న ఈయంటిలకు,పైలెట్లకు అదనంగా రూ.2వేలు గౌరవ వేతనం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సంబంధిత ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.శుక్రవారం బుచ్చయ్యపేటలో 108 అంబులెన్స్ వద్ద థాంక్యూ సీఎం సార్ అంటూ ప్ల కార్డులు ప్రదర్శించి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.వేతనం పెంపుతో పాటు 5ఏళ్లు,10ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకొన్న ఉద్యోగులకు ఆటోమేటిక్ స్లాబ్ అప్గ్రేడేషన్ చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల 108 అంబులెన్స్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.ఈ నెల నుండి పెరిగిన జీతాలు చేతికి అందడంతో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబుకి ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఉద్యోగులు తెలిపారు.పెరిగిన వేతనాలతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు తీసుకు వస్తామన్నారు.ఈఎంటీలు వెంకు నాయుడు, హేమ సుందర్, పైలెట్లు శ్రీనివాసు,మణికుమార్ పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version