Home Politics Andhra Pradesh పిఎసిఎస్ ఉద్యోగులు సమ్మె నోటీసు

పిఎసిఎస్ ఉద్యోగులు సమ్మె నోటీసు

0

రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పిఎసిఎస్ ఉద్యోగులు ఈనెల 16 నుండి నిరవధిక సమ్మెకు దిగనున్నారు.ఈ మేరకు శుక్రవారం వడ్డాది పిఎసిఎస్ లో చైర్పర్సన్ దొండా నరేశ్ కి సీఈఓ ఎన్.శాంతి ఆధ్వర్యంలో స్థానిక ఉద్యోగులు సమ్మె నోటీసు అందజేశారు.జీవో నెం.36 ప్రకారం పిఎసిఎస్ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ, రాష్ట్రస్థాయిలో ఎస్ఎల్ఈసి, జిల్లాస్థాయిలో డీఎల్ఈసీ అమలు చేయాలన్నారు.2019, 2024 వేతన సవరణ, ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు, 2019 తరువాత సంఘాలలో చేరిన ఉద్యోగుల క్రమబద్ధీకరణ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుందని ఆవేదన చెందారు.గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అనేక నిరసన కార్యక్రమాలు చేపట్తిన్నా ఫలితం లేదు అన్నారు.తమ సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మెకు దిగుతాం అన్నారు.రైతులకు సహకార సేవలు అంతరాయం కలగకుండా ప్రభుత్వం స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సహకార ఉద్యోగులు కోరారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version