Home Uncategorized భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

0

యలమంచిలి, జయ జయహే న్యూస్ : కార్తీకమాసం పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం యలమంచిలి మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పులపర్తి గ్రామంలో ఉన్న శివాలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి స్థానిక భక్తులతో పాటు పద్మనాభరాజుపేట, బయ్యవరం, ములకలాపల్లి, లక్కవరం, పురుషోత్తపురం, కృష్ణాపురం, గూండ్రుబిల్లి తదితర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ ఆలయానికి తరలి వెళ్లి ఆలయ అర్చకుల మంత్రోచ్ఛారణ నడుమ శివాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో ఉన్న దేవతామూర్తులు అలాగే ధ్వజ స్తంభం వద్ద మహిళా భక్తులు దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు ప్రసాద వితరణ చేపట్టారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version