Home Uncategorized కౌంటర్ దాఖలు చేయండి-పరకామణి కేసులో హై కోర్టు ఆదేశాలు

కౌంటర్ దాఖలు చేయండి-పరకామణి కేసులో హై కోర్టు ఆదేశాలు

0

టీటీడీ పరకామణి చోరీ కేసు పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానం నోటీసులు జారీ చేసిన వారిలో దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, లీగల్ సర్వీసెస్ అథారిటి మెంబర్ సెక్రటరీ, తిరుపతి మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, సీఐడీడీజీ, టీటీడీ ఈవో, సీవీఎస్‌ఓ, తిరుపతి వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్ఓ, పరకామణి అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్, నిందితుడు పీవీ రవికుమార్‌ ఉన్నారు.

అయితే తదుపరి విచారణని నవంబరు 17వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. పరకామణి చోరీ కేసులో లోక్ అదాలత్ ఇచ్చిన ఉత్తర్వుల చట్టబద్ధతను తేల్చే వ్యవహారాన్ని న్యాయమూర్తులు జస్టిస్ రఘునందనరావు, జస్టిస్ సుభేందులకు చీఫ్ జస్టిస్ అప్పగించారు. పరకామణి చోరీ కేసుపై రాజీ, ఇతర అంశాలపై తాను ఇచ్చిన ఉత్తర్వులను సీజే ముందు ఉంచాలని గతంలో సింగిల్ జడ్జ్ ఆదేశించిన విషయం తెలిసిందే.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version