ఇంతకాలం వినోదానికి దూరమైనా పాడేరు ఇక నుంచి దానికి చేరువ కాబోతుంది. శుక్రవారం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర తార సితార మల్టీప్లెక్స్ థియేటర్ లాంచ్ చేశారు. తొలి సినిమాగా మెగాస్టార్ చిరంజీవి, నయనతార నటించిన మన వరప్రసాద్ చిత్రాన్ని ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ పాడేరు ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నిర్మించిన ఈ థియేటర్ ను తెలుగుదేశం పార్టీ అరకు ఇంచార్జ్, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్ను దొర , జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ , పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి కొప్పుల వేలమ కార్పొరేషన్ చైర్మన్ జీవీ కుమార్, డిఎస్పీ
సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాడేరును వినోదాత్మక కేంద్రంగా ఈ థియేటర్ మార్చబోతుందని కార్యక్రమానికి హాజరైన ప్రముఖులంతా ఆకాంక్షించారు. ఇంతకాలం ఎంటర్టైన్మెంట్ రంగానికి దూరమైన పాడేరు ఇక నుంచి ఈ థియేటర్ తో ఆ సమస్య తొలిగిపోయిందన్నారు. థియేటర్ ప్రారంభోత్సవం సందర్భంగా పర్యాటక రంగాన్ని కూడా ఆకర్షించేలా అధునాతన సాంకేతికతతో అత్యంత ఆకర్షణీయంగా ఈ మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మించడానికి అంత ప్రశంసించారు. తన ఆహ్వానం మన్నించి థియేటర్ ప్రారంభత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఈశ్వరి సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
