Home Politics Andhra Pradesh ఉచిత కళ్లద్దాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి

ఉచిత కళ్లద్దాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి

0

ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ శ్రీ పూజ
విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణీ కార్యక్రమం
బుధవారం జిల్లా జిల్లా అంధత్వ నివారణ సంస్థ, పాడేరు ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిణి తిరుమణి శ్రీ పూజ చేతుల మీదుగా శ్రీకృష్ణపురం ప్రభుత్వ పాఠశాల చదుతున్న 17 విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారిణి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని తెలియచేశారు. కంటి అద్దాలు తప్పనిసరిగా వాడుకుంటే దృష్టి లోపాలను నివారించవచ్చునని తెలియచేశారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ డా.టి.విశ్వేశ్వరనాయుడు జిల్లా వ్యాప్తంగా 347 పాఠశాల తనిఖీలు చేయగా 2000 విద్యార్థులు దృష్టి లోపాలను గుర్తించడం జరిగినది. వీరందరికీ ప్రభుత్వం తరుపున కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నట్లు తెలియచేస్తున్నాం. ముఖ్యంగా పిల్లలు సెల్ ఫోన్ వాడకం వలన కంటికి సంబంధించిన దృష్టి లోపాలు రావటానికి ఎక్కువ అవకాశం ఉందని తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో డి. వెంకటరావు అప్తల్మిమిక్ అధికారి, సంజీవ పాత్రుడు ఆరోగ్య విస్తరణ అధికారి పాఠశాల ప్రధానోపాద్యులు మంజుల మరియు సిబ్బంది పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version