Home Politics Andhra Pradesh జాబ్ మేళా సద్వినియోగపరచుకోండి

జాబ్ మేళా సద్వినియోగపరచుకోండి

0

106 మంది ఎంపిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం చోడవరం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లో మెగా జాబ్ మేళా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా వివిధ ట్రైనింగ్ కార్యక్రమాలు మెగా జాబ్ మేళాలను నిర్వహించటం వలన స్థానిక నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరుచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ స్థానికంగానే కాకుండా ఎక్కడ జాబ్ వస్తే అక్కడ జాయిన్ అయి ఆ ఆదాయంతో కుటుంబాన్ని తీర్చిదిద్దగలరని నిరుద్యోగ యువతీ యువకులకు ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్లేసెమెంట్ అధికారి శ్రీనివాస రావు మాట్లాడుతూ ఈరోజు జరిగిన జాబ్ మేళాకు సుమారుగా 11 ఎమ్మెన్సీ కంపెనీలు హాజరయ్యాయని, అలాగే 1100 ఖాళీలు వివిధ కంపెనీలో ఉన్నాయన్నారు. ఈ జాబ్ మేళాకు 10వ తరగతి నుండి పీజీ వరకు, అలాగే ఐటి డిప్లమో బీటెక్ బి బి ఏ ఎం బి ఏ బి ఏ బీకాం బీఎస్సీ కి సంబంధించి ప్రతి ఒక్క నిరుద్యోగి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానికంగా కానీ మరియు ఇతర ప్రదేశాల్లో కూడా ఉద్యోగ అవకాసం పొందినటువంటి వారు నియామకం పత్రం తీసుకున్న ప్రతి వ్యక్తి ఆ కంపెనీలో జాయిన్ అవ్వాలని,అది దూరమా దగ్గరని చూడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసారు.
ఈ జాబ్ మేళలో 11 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొనగా 265 మంది నిరోద్యోగ యువతీ, యువకులు హాజరువ్వగా వారిలో106 మంది వివిధ కంపెనీ లకు ఎంపికయ్యారు.ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version