Home Devotional మాడుగులలో ఘనంగా సుబ్రమణ్య స్వామి షష్టి వేడుకలు

మాడుగులలో ఘనంగా సుబ్రమణ్య స్వామి షష్టి వేడుకలు

0

మాడుగుల మండలంలో బుధవారం సుబ్రహ్మణ్య స్వామి వారి షష్టి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేజేపురం శ్రీ కళ్యాణవెంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణంలో గల సుబ్రహ్మణ్యస్వామి వారి సన్నిధిలో సుబ్రహ్మణ్యస్వామి షష్ఠి సందర్బంగా పంచామృత అభిషేకంలు నిర్వహించారు. అనంతరం హోమాది కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం అన్న ప్రసాద వితరణ జరిగింది.అలాగే మాడుగుల పార్థసారథి స్వామి వారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో దుక్క దుర్గా రెడ్డి దంపతుల సహకారంతో స్వామివారికి ప్రత్యేక పూజలు పంచామృత అభిషేకాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే అలాగే మాడుగుల శివాలయాల్లో గల సుబ్రమణ్య స్వామి మందిరాల్లో కూడా సుబ్రహ్మణ్యం స్వామి షష్టి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. మాడుగుల మాదమాంబ కాలనీలో గల సుబ్రహ్మణ్య స్వామి మందిరంలో కూడా ప్రత్యేక పూజలు పంచామృతాభిషేకాలు, రాత్రి సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version