ఎంపీ సీఎం రమేష్
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లాలో క్రియాశీల సభ్యులతో కీలక సమావేశం బుధవారం అనకాపల్లి బైపాస్ సమీపంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు ద్వారాపురెడ్డి పరమేశ్వర రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎంపీ రమేష్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి క్రియాశీల సభ్యుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. బూత్ స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మరింత బలపరచాల్సిన అవసరం ఉందన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసి, ప్రతి ఇంటికి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే పార్టీ కార్యక్రమాల్లో ప్రతి కార్యకర్త చురుకుగా పాల్గొని ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లా అధ్యక్షులు ద్వారాపురెడ్డి పరమేశ్వర రావు మాట్లాడుతూ పార్టీ విస్తరణలో క్రమబద్ధమైన కార్యాచరణతో ముందుకు సాగాలని అన్నారు. సభ్యత్వ విస్తరణతో పాటు గ్రామ స్థాయిలో బాధ్యతలను స్పష్టంగా పంచుకుని పనిచేస్తే పార్టీ మరింత బలపడుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో భాగంగా ఎస్ ఐ ఆర్ సమావేశం కూడా ప్రత్యేకంగా నిర్వహించి, సభ్యులు తమ పరిధిలో జరుగుతున్న సభ్యత్వ నమోదు, పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై స్పందించారు. పలువురు నాయకులు, క్రియాశీల కార్యకర్తలు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్ ,బీజేపీ సీనియర్ నాయకులు పుట్ట గంగయ్య, వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి లు బొడ్డెడ నాగేశ్వర రావు, రామునాయుడు, రాష్ట్ర మీడియా పానలిస్ట్ ఈర్లే శ్రీరామ్ మూర్తి, రాజాబాబు, రాష్ట్ర నాయకులు పొనగంటి అప్పారావు, అంబేద్కర్ మండల అధ్యక్షులు వి. నర్సింగ్ యాదవ్ సహా జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

