విశాఖలో ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి వెళ్తున్న పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజును బుచ్చియ్యపేట పోలీసులు అడ్డుకున్నారు.
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు ఎమ్మెల్యేను బుచ్చెయ్యపేటలోనే నిలిపివేశారు.నిరసనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయగా, ఎమ్మెల్యే అనుచరులు ఆందోళనకు దిగారు.దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈసందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ…ఏబీఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, అవి సభ్య సమాజాన్ని సిగ్గుపడేలా చేస్తున్నాయని విమర్శించారు.పెళ్లానికి, చెల్లికి తేడా తెలియకుండా వైసీపీ కార్యకర్తలు, నాయకులపై అసభ్య పదజాలం వాడటం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ఈ తరహా వ్యాఖ్యలు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో “రెడ్ బుక్ రాజ్యాంగం” నడుస్తోందని ఆరోపించారు.వైసీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.
వేమూరి రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు.జడ్పీటీసీ దొండా రాంబాబు,వైసీపీ నేతలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను విశ్వేశ్వరరాజు ను అడ్డుకున్న పోలీసులు
RELATED ARTICLES
