Home Politics Andhra Pradesh దీర్ఘకాలిక వ్యాధులపై వీధి నాటిక

దీర్ఘకాలిక వ్యాధులపై వీధి నాటిక

0

దీర్ఘకాలిక వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలనే సందేశాన్నిస్తూ.. మంగళవారం మాకవరపాలెం బస్టాండ్ వద్ద జరిగిన వీధినాటిక ఆహుతులకు ఆద్యంతం అలరించింది. హృదయ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వీధి నాటక ప్రదర్శన చేశారు .దీర్ఘకాలిక వ్యాధులైన మధూమేహం, అధిక రక్తపోటు , ఆర్థరైటిస్ వంటి వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. వాటిని మందులతో నియంత్రించుకోవచ్చును గాని పూర్తిగా నిర్మూలన చేయలేమని, కాబట్టి క్రమం తప్పకుండా మందులు వాడుతూ క్రమ పద్ధతిలో వ్యాయామాలు చేస్తూ మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు అన్నారు. ఈ వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే వ్యాధులు కాదని అయితే జీవితాంతం వీటితో నిర్వహణ కొనసాగించాలని ఈ వ్యాధులు ఉన్నవారు ఖైనీ , గుట్కా వంటి పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్లరాదని సూచించారు. ఈ వ్యాధులతో బాధపడుతున్నవారు తమ వ్యవహార జీవన శైలిని మార్చుకోకపోతే ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి వస్తుందన్నారు .బహుళ దీర్ఘకాలిక వ్యాధుల తో బాధపడుతున్న వారు క్రమ పద్ధతిలో మెడిసిన్స్ వాడేందుకు పిల్ ఆర్గనైజర్, రిమైండర్ , స్థానిక హెల్త్ కోఆర్డినేటర్ వంటివారి సహకారంతో ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
జంక్ ఫుడ్స్ జోలికి పోకుండా తృణ ధాన్యాలు, డ్రైఫ్రూట్స్ , ఉడకపెట్టిన ఆహార పదార్థాలను తీసుకోవాలన్నారు.
ఢిల్లీ నుండి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి హృదయ్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ..డాక్టర్ మాన్సీ చోప్రా మాట్లాడుతూ వ్యాధుల పట్ల పలు సూచనలు చేశారు. మాకవరపాలెం పిహెచ్ సి వైద్యులు శ్రీనివాస్, రీసెర్చ్ అసిస్టెంట్ .కే సతీష్, కోఆర్డినేటర్లు శివ తదితరులతో పాటు భద్రం ఫౌండేషన్ కళాకారులు డేవిడ్ రాజు, ఎండి .మొహిదీన్ , బోరాసముద్రం, ఎస్. భవాని రాజు , కే .కుమారి ,బోనీ రమేష్ , కెమెరామెన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version