Home Politics Andhra Pradesh షోడశ గుణాభిరాముడు శ్రీరాముడు

షోడశ గుణాభిరాముడు శ్రీరాముడు

0

డాక్టర్ దోనేపూడి నరేశ్ బాబు

జూలేపల్లిలో ప్రారంభమైన ధార్మిక కార్యక్రమాలు*

శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడని, సకల గుణాభిరాముడైన శ్రీరాముడి నుండి ఈనాటి సమాజం నేర్చుకోవలసిన ఎన్నో విషయాలు ఉన్నాయని, రామాయణంలో శ్రీరాముడు 16 గుణాలతో శోభిల్లుతున్న లోకోత్తరమైన నాయకుడి చరిత్రను ఈనాటి సమాజం అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతో ఉన్నదని తెలుగు పండితులు డాక్టర్ దోనెపూడి నరేశ్ బాబు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గోస్పాడు మండలం, జూలేపల్లి గ్రామంలోని శ్రీ సాయిబాబా మందిరం నందు ధార్మిక కార్యక్రమాలలో భాగంగా మొదటి రోజు శ్రీమద్రామాయణంలోని లోకోత్తర నాయకుడైన శ్రీరామచంద్రుడి యొక్క చరిత్రను భక్తులకు వివరించారు. ధార్మిక వ్యాప్తి కోసం తిరుమల తిరుపతి దేవస్థానములు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉందని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నున్న సుబ్బరాయుడు, కె కృష్ణమూర్తి, రెడ్డి మధు, అడపా వెంకటసుబ్బయ్య, కె శివ, మంజుల రాముడుతోపాటు స్థానిక భక్త సమాజాల సభ్యులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version