శ్రీ సత్యనారాయణ స్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ జనసేనలో చేరిక
• పార్టీ కండువా వేసి పార్టీలోని ఆహ్వానించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
విశాఖపట్నం జయ జయహే జనసేన పార్టీ నగర కార్యాలయంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యులు వంశీ కృష్ణ శ్రీనివాస్ సమక్షంలో కోరిపల్లి ఆనంద్ ఆధ్వర్యంలో 30వ వార్డులో వైసిపి నుండి సుమారు 100 మంది మహిళలు, యువకులు జనసేనపార్టీలోకి చేరారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు,ఆశయాలకు అనుగుణంగా, వంశీ కృష్ణ శ్రీనివాస్ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై 30వ వార్డులో సాలిపేట ఏరియాకి చెందిన ఎల్. రాజు, జనార్దన్, వినయ్, అప్పలరాజు, యేసు, నాగరాజు, ఎంవీఎస్ ఎన్ మూర్తి,పి. కృష్ణ, రాజేష్, కిరణ్, ఈశ్వరరావు, లక్ష్మి, మంగవేణి, త్రివేణి సహా అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ 30వ వార్డులో జనసేన నాయకత్వం బలంగా ఉందని,నాయకత్వం బలంగా ఉన్న దగ్గరే ఎక్కువ అభివృద్ధి పనులు జరుగుతాయని తద్వారా ప్రజలు ఆకర్షితులవుతున్నారని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించమని నాకు ఎప్పుడూ చెబుతూ ఉంటారని ,మీకు ఏ ఒక్క కష్టం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన 30వ వార్డు అధ్యక్షులు యజ్ఞశ్రీ 30 వార్డ్ జనసేన నాయకులు జన, వినయ్, శంకర్ మరియు జనసైనికులు వీరామహిళలు పాల్గొన్నారు.
