Home Uncategorized శ్రీ సత్య సాయి సహస్ర దీపోత్సవం

శ్రీ సత్య సాయి సహస్ర దీపోత్సవం

0

విశాఖపట్నం జయ జయహే: ఎం.వి.పీ కాలనీ లోని శ్రీ సత్య సాయి ప్రేమసదన్ మందిరం ప్రాంగణం ఆదివారం పవిత్రత, భక్తి, ఆనందాలతో కళకళలాడింది. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన శ్రీ సత్య సాయి సహస్ర దీపోత్సవం లో అనేక మంది భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని ప్రముఖ వ్యాపారవేత్త, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా భక్తుడు సి. హెచ్. రంగనాథ్ ప్రారంభించారు. వేడుకలో భాగంగా 100 అడుగుల భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శతవర్ష లోగోను శ్రీ సత్య సాయి విద్యా విహార్ పాఠశాల ప్రాంగణంలో నేలపై సుందరంగా అలంకరించి, వెయ్యి దీపాలతో ప్రకాశవంతం చేశారు.

అలాగే 100 మంది బాలవికాస్ విద్యార్థులు లవ్ సింబల్ ఆకారంలో మానవ హారం ఫార్మేషన్ లో నిలబడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు. ఆకాష్ లాంతర్ల వెలుగులు, గ్యాస్ బెలూన్ల ఆకాశయానం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 100 వ జన్మదిన వేడుకల ఆహ్వానపత్రికను అతిధులు ఆవిష్కరించారు
ఈ వేడుకలో శ్రీ సత్య సాయి సేవా సంస్థల విశాఖ జిల్లా అధ్యక్షులు పి.ఆర్.ఎస్.యెన్. నాయుడు, విశాఖ సిటీ సమితి కన్వీనర్ బి. సాయికుమార్, సంస్థల పదాధికారులు, యువత, మహిళా విభాగ సభ్యులు, పౌరులు పాల్గొని భగవాన్ పట్ల తమ ప్రేమను, కృతజ్ఞతను అర్పించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version