Home Politics Andhra Pradesh అత్యంత వైభవంగా శ్రీ సత్య సాయి రన్ అండ్ రైడ్

అత్యంత వైభవంగా శ్రీ సత్య సాయి రన్ అండ్ రైడ్

0

అందరినీ ప్రేమించు- అందరినీ సేవించు దివ్య సందేశం పాటిద్దాం- డా. శంఖబ్రత బాగ్చీ,  భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జన్మ శతజయంతి వేడుకలలో భాగంగా, ఐక్యతా భావం మరియు ఫిట్ ఇండియా ఉద్యమంను ప్రోత్సహించే లక్ష్యంతో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు శ్రీ సత్య సాయి రన్ అండ్ రైడ్(సైక్లింగ్ ) – 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమాన్ని ఆర్.కే. బీచ్‌లోని కాలిమాత ఆలయం వద్ద విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చీ, మరియు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణ రావు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా 3 కి.మీ, 5 కి.మీ రన్ అండ్ రైడ్ (సైక్లింగ్)లో వివిధ వర్గాలకు చెందిన సుమారు 6,800 మంది ప్రజలు ఉత్సాహం

గా పాల్గొని ఐక్యతా–సామరస్య సందేశాన్ని చాటారు.డా. శంఖబ్రత బాగ్చీ మాట్లాడుతూ, ఈ రన్ అండ్ రైడ్ కార్యక్రమం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించబడటం గర్వకారణమని తెలిపారు. పాల్గొన్న వేలాది మందిని అభినందిస్తూ, ప్రేమ, స్నేహం, సేవ అనే భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి సందేశాలను ప్రజల్లో వ్యాప్తి చేయాలని డా. శంఖబ్రత బాగ్చీ పిలుపునిచ్చారు.డా. శంఖబ్రత బాగ్చీ మరియు ఆర్. లక్ష్మణ రావు శ్రీ సత్య సాయి యూనివర్సల్ టార్చ్ ఆఫ్ పీస్ ను పట్టుకుని బీచ్ రోడ్డులో నడిచారు. ఈ జ్యోతి భగవాన్ సందేశాలైన ఐక్యత, పవిత్రత, దైవత్వాన్ని 140 దేశాల్లో వ్యాప్తి చేసే గ్లోబల్ కార్యక్రమమని, దీనిని 2025 నవంబర్ 22న పుట్టపర్తిలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు.రాష్ట్ర అధ్యక్షులు ఆర్. లక్ష్మణ రావు మాట్లాడుతూ, ఈ కార్యక్రమం కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా, ఆరోగ్యం, ఐక్యత, నిస్వార్థ సేవతో కూడిన ఒక పవిత్ర ప్రయాణమని పేర్కొన్నారు. యువత, సేవాదళ్ సభ్యులు, నిర్వాహకుల కృషిని అభినందిస్తూ, ఈ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించాలన్నారు. శ్రీ సత్య సాయి విద్యావిహార్ విద్యార్థులు ‘సారే జహాన్ సే అచ్చా’, ‘చక్ దే ఇండియా’ గీతాలపై చేసిన వాయిద్య సంగీత ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.అంతకు ముందు, శ్రీ ఆర్. లక్ష్మణ రావు , జిల్లా అధ్యక్షులు పి.ఆర్.ఎస్.ఎన్. నాయుడు తదితరులు సంప్రదాయ జ్యోతి ప్రజ్వలన చేసి దైవానుగ్రహాన్ని ప్రార్థించారు. జిల్లా అధ్యక్షులు పి.ఆర్.ఎస్.ఎన్. నాయుడు జిల్లా పరిపాలన, జీవీఎంసీ, పోలీసు, రెవెన్యూ శాఖలకు ఆ కార్యక్రమం నిర్వహించడానికి సహాయ సహకారాలను అందచేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ గాయకులు అన్ని మతాల ప్రార్థనలను పాడగా, ప్రముఖ ఫిట్‌నెస్ కోచ్ పద్మిని రాజు జుంబా ద్వారా వార్మ్-అప్ సెషన్ నిర్వహించారు.
నమోదైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక టీ-షర్టు, అల్పాహారం, ఫినిషర్ మెడల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం మాజీ ఎమ్మెల్యే సైరాజు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ విజయ, రాష్ట్ర-జిల్లా పదాధికారులు, యువత, మహిళలు, సేవాదళ్ సభ్యులు, సత్య సాయి విద్యావిహార్ ప్రిన్సిపల్ మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version