అల్లూరి జిల్లా, హుకుంపేట మండలం, మఠం గ్రామపంచాయతీ మత్స గుండంలో మఠ్యలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం
శ్రీ శ్రీ శ్రీ మఠ్యలింగేశ్వర స్వామి మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని,జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు జిల్లా అధికారులతో, ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమన్వయ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించిన ఇన్చార్జి ఆర్డీవో, స్పెషల్ డిబేట్ కలెక్టర్ ఎం.వి.ఎస్ లోకేశ్వరరావు, డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ వి వి ఎస్ అభిషేక్, డిఎల్పిఓ పి ఎస్ కుమార్ ఆధ్వర్యంలో పాడేరు ఆర్డిఒ కార్యలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఫిబ్రవర 14, 2026 నుండి ఫిబ్రవరి 16, 2026 వరకు మూడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి.
14.02.2026: ఉత్సవాల ప్రారంభం, ప్రత్యేక పూజలు, అంకురార్పణం, ఉదయం 8. 00 గంటల నుండి మాన్యాస పూర్వక రుద్రాభిషేకం పూజలు,స్వామి వారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, 15 వ తేదీన అర్ధరాత్రి లింగోద్భవ కాల పూజలు, ఉదయం 6.00 గంటల నుండి ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణ మహోత్సవం, సాయంత్రం 3.00గంటలకు నుండి ఉత్సవ మూర్తుల ఊరేగింపు,
16 తేదీన స్వామి వారి విశేష పూజలు మరియు అభిషేకలు జరుగును. ఈ మూడు రోజులు
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ మరియు యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లను చేసామన్నారు. భక్తుల దర్శనార్థం భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి, సాధారణ, ప్రత్యేక దర్శనలకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు.
మౌలిక వసతులు స్వచ్ఛమైన త్రాగునీరు, తాత్కాలిక షెడ్లు మరియు విశ్రాంతి గదుల ఏర్పాటు,ఆరోగ్యం, భద్రత, అత్యవసర వైద్య శిబిరలు, సిసిటివి కెమెరాలతో నిరంతర నిఘా ఉండే విధంగా చూడాలన్నారు.
భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక భక్తుల కొరకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని పాడేరు ఆర్టీసీ డిఎంఓ ను ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా షాపులతో భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
శివనామ స్మరణతో మారుమోగే ఈ మహోత్సవానికి భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి, స్వామి కృపకు పాత్రులు కావాలని కోరు కుంటున్న భక్తులకు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులకు ఏర్పాట్లపై
పలు సూచనలు చేశారు. ఎటువంటి ఆవంచనియ సంఘటనలు జరగకుండా పోలీస్, మండల తాసిల్దార్, ఎంపీడీవో అధికారులకు సూచించారు. అనంతరం మత్స గుండం శివరాత్రి ఏర్పాట్లును పరిశీలించిన ఇన్చార్జి రెవెన్యూ అధికారి.
ఈ సమాజంలో రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ గిరిజన సంక్షేమ, వైద్య ఆరోగ్య, విద్యుత్, ఇరిగేషన్, నీటి సరఫరా ఆర్టీసీ అగ్నిమాపక శాఖలు, మఠం గ్రామ సర్పంచ్, కమిటీ సభ్యులు అప్పారావు, తదితరులు పాల్గొన్నారు
