రాష్ట్రంలో నిరుద్యోగులను ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సారధ్యంలో టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ టి గోవిందమ్మ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ను నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 147 మంది నిరుద్యోగులు పాల్గొనగా వీరిలో 64 మంది అర్హతలు ఆధారంగా వివిధ కంపెనీలకు ఎంపిక అయ్యారు, ప్లేస్ మెంట్ అధికారి ఎం వంశీకృష్ణ, ఐక్యూ ఏసి కోఆర్డినేటర్, ల్యూక్ పాల్, పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
