Home Editorials విద్యార్థులకు స్పెషల్ బి పోటీలు

విద్యార్థులకు స్పెషల్ బి పోటీలు

0

చోడవరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల లో సోమవారం మండల స్థాయి “స్పెల్ బి” పోటీలు నిర్వహించారు. 6 నుంచి 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు తరగతుల వారీగా మండల విద్యాశాఖాధికారులు పాండురంగారావు, సింహాచలం, ప్రధానోపాధ్యాయులు రామిరెడ్డి ఆధ్వర్యంలో ఆంగ్ల బాషోపాద్యాయులు ఈ పోటీలు నిర్వహించారు. ఈపోటీలలో గెలుపొందిన విద్యార్థులను తరగతికి ఒక్కరిని జిల్లా స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంగ్ల భాషపై మక్కువ చూపాలని, మౌఖిక, వ్రాత పూర్వక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆంగ్ల భాష ప్రాముఖ్యత ను వివరించారు.ఈపోటీలలో 6వ తరగతి వి.జోస్యశ్రీ,,బాలికోన్నత పాఠశాల , చోడవరం,7వ తరగతి బి.లక్ష్మి ప్రసన్న ,లక్ష్మిపురం ఉన్నత పాఠశాల ,8వ తరగతి సి.హెచ్.చందు, దుడ్డు పాలెం ఉన్నత పాఠశాల,9వ తరగతి ఆర్.లేఖన,బాలికోన్నత పాఠశాల,చోడవరం, 10వ తరగతి ఆర్.జ్యోత్స్న ,జ్యోతీ రావు పూలే,చోడవరం గెలుపొందారు.ఈకార్యక్రమంలో ఆంగ్ల ఉపాధ్యాయులు సి.ఆర్.యమ్.టి లు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version