అనకాపల్లి లో వెలసివున్న శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు పురస్కరించుకొని మంగళవారం జిల్లా ఎస్పీ తుహిన్ సిహ్నా నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యూ లైన్ అలాగే ఆలయ ప్రాంగణం అంతా పరిశీలించి తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు దేవాలయ సిబ్బందికి ఆయన సూచించడం జరిగింది. ప్రస్తుత వేసవికాలం కావడంతో ఎండలు ఎక్కువగా ఉంటాయని క్యూ లైన్ లో భక్తులు గంటలు తరబడి వేచి ఉండవలసిన వచ్చినప్పుడు వడదెబ్బ గురికాకుండా భక్తులు నీడలో ఉండేలా మంచినీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బందోబస్తుల ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలని రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తోపులాటలు జరగకుండా చూడాలని ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలు వృద్ధులు పట్ల సున్నితంగా అధికారులు వ్యవహరిస్తూ వారికి తగిన సహకారం అందించాలని వారితో దురుసుగా మాట్లాడవద్దని, జాతర నెలరోజులపాటు ముఖ్యంగా పట్టణంలో అలాగే దేవాలయం చుట్టూ ఉన్న ట్రాఫిక్ సమస్య చాలా ఎత్తకుండా ప్రత్నమయా మార్గాల ద్వారా ట్రాఫిక్కును మళ్లించడం చేయాలని, పార్కింగ్ స్థలాల వద్ద సిబ్బంది నిరంతరం నిఘా ఉంచాలని , జన సందోహంలో దొంగతనాలు చైన్ స్నాచింగ్ వంటి జరగకుండా పోలీసులు సాదాసీదా దుస్తుల్లో నిఘా బృందాలను ఏర్పాటు చేయాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. భారీ విద్యుత్ దీపాలంకరణ మరియు స్టేజి ప్రోగ్రాములు వద్ద ఎటువంటి అల్లర్లు మరియు అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు అగ్నిమాపక సకటాని, యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని ఆయన సూచించారు. వేలాదిగా తరలి వచ్చే భక్తులు పోలీసులు వారికి సహకరించాలని ఎండ తీవ్రత దృశ్య తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే దగ్గరలో పోలీసు సిబ్బందిని సంప్రదించాలని వారు పేర్కొన్నారు.ఈ సమీక్ష సమావేశంలో సబ్ డివిజన్ డిఎస్పి ఎం శ్రావణి ఆలయ చైర్మన్ పి నాగ శ్రీను ఇన్స్పెక్టర్లు ప్రేమ్ కుమార్, వెంకటనారాయణ ఎస్సై సంతోష్ కుమార్ మరియు దేవాలయ సిబ్బంది కమిటీ సభ్యులు, పోలీసు అధికారులు పాల్గొనడం జరిగింది
