చోడవరం నియోజవర్గ పరిధిలో గల రావికమత మండలం కన్నంపేట గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యురాలు గల్లా లక్ష్మి అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందారు.
వారి కుటుంబానికి భరోసాగా కన్నంపేట గ్రామ పార్టీ అధ్యక్షులు దంట్ల శివ తన సొంత నిధుల నుండి పదివేల రూపాయలను సోమవారం చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు.
భవిష్యత్తులో కూడా పార్టీ కార్యకర్తలకు అన్ని రకాలుగా భరోసాగా నిలుస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్ దంట్ల రాజేష్ భీమరాతి ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.
