Home Politics Andhra Pradesh శ్రీ నూకంబిక దేవాలయంలో ఘనంగా జరుగుతున్న శ్యామలాదేవి నవరాత్రులు

శ్రీ నూకంబిక దేవాలయంలో ఘనంగా జరుగుతున్న శ్యామలాదేవి నవరాత్రులు

0

స్థానిక గవరపాలెంలో వేంచేసి ఉన్న శ్రీశ్రీ శ్రీ నూకాంబిక దేవాలయం మాఘమాసం పురస్కరించుకుని శ్యామలాదేవి నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది మరియు వసంత పంచమి సందర్భంగా శుక్రవారం స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది వీరికి ఆలయ పాలకవర్గ సభ్యులు, దేవస్థానం సిబ్బంది కూటమి నాయకులు మేళతాళాలతో పండితులు పూర్ణ కలశం తో ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా శ్రీ రాజ శ్యామల దేవి హోమం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ పూజలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఈ హోమం లో పాల్గొని పూర్ణహహుతి సమర్పించడం జరిగింది. అలాగే ఆలయ మండపంలో శ్రీ మాతంగి స్వరార్చన 108 ఆలయాల్లో ఆర్గనైజర్లకే భవాని, వి బాబురావు అమ్మవారి పాటలో సంకీర్తన వేణుగోపాల్ భక్తి స్వరాంజలి భక్తులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పి నాగ శ్రీను (గొల్ల బాబు) ఆలయ సహాయ కమిషనర్ ఎ శ్రీధర్, ఆలయ ధర్మకర్తలు సూర్ సతీష్, దాడి రవికుమార్, పొలిమేర స్వాతి ఆనంద్, మారిశెట్టి శంకర్రావు, కాండ్రేగుల రాజారావు ,మజ్జి జానకి శ్రీనివాస్ రావు, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి, ఎర్రవరపు సంతోష్ కుమారి, కూటమి నాయకులు
దూలం గోపి దంపతులు ఈ వసంత పంచమి హోమ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version