Home Politics Andhra Pradesh అరకులో ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు.

అరకులో ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు.

0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోయే తరానికి భవిష్యత్ ఉన్న నాయకుడు నారా లోకేష్ అని అరకులోయ విజయనగరం ఆర్టీసీ జోన్ చైర్మన్ సియ్యారి దొన్ను దొర పేర్కొన్నారు. అయన మాట్లాడుతూ. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా, మారుస్తూ, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తున్న విద్య, మెరుగైన సౌకర్యాల కోసం మీరు చూపిస్తున్న చొరవ భావి తరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది.రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరు సాగిస్తున్న ప్రయాణం అద్భుతం. ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నిలిపేందుకు అహర్నిశలు కృషి చేసారు. ఐటీవిద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అని అన్నారు. మంత్రి లోకేష్ జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ గ్రౌండ్ వద్ద కార్యకర్తల మధ్య కేక్ ను కట్ చేసి అరకు ఏరియా ఆసుపత్రిలో రోగులను రొట్టెలు పళ్ళు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు జరిపారు. టిడిపి పార్టీ శ్రేణులతో ఈ సందర్భంగా ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు లోకోయ్ మహాదేవ్. అనంతగిరి మండల పార్టీ అధ్యక్షుడు సోవెరీ సుబ్బారావు. డుంబ్రిగూడ కిల్లో ఆనందరావు. పెదబయులు కొండయ్య. ముంచింగిపుట్ సన్యాసమ్మ. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శెట్టి బాబురావు. తుడుం సుబ్బారావు. కొములునాయుడు. పెదలబుడు సర్పంచ్ పెట్టేలి దాసుబాబు . బోరి బోరి లక్ష్మి మార్కెటింగ్ చైర్మన్. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version