Saturday, April 18, 2026
HomeNewsసనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి: ఎమ్మెల్యే గంటా

సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి: ఎమ్మెల్యే గంటా

సనాతన ధర్మంపై ఇస్కాన్ ఆలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం ఎంతో ఉత్కృష్టమైనదని.. దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇస్కాన్ కు స్థానిక ఎమ్మెల్యేగా సహకారం అందించడానికి ఎప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. ఆధ్యాత్మికతతో మనసుకు ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. అనంతరం విశాఖ వచ్చిన ఇస్కాన్ పరిపాలిక మండలి కమిషన్ ప్రతినిధి జయపతాక స్వామి మహరాజ్ తో భేటీ అయ్యారు. మహారాజ్ ను శాలువాతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు సాంబాదాస్, సుఖదేవ్, విజయ్ భగవత్, నితయ్, అద్వైత నవదీప్, పురుషోత్తం, వినయ్, ప్రేమ్, టీడీపీ నాయకులు చిక్కాల విజయ్ బాబు, చెట్టుపల్లి సన్యాసిరావు, లొడగల అప్పారావు, మాన్యాల సోంబాబు, సారిపల్లి శ్రీనివాస్, మొల్లి లక్ష్మణరావు, గరే గుర్నాథ్, నాగోతి సత్యనారాయణ, కానూరు అచ్యుతరావు, దొరబాబు, పాసి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments