Saturday, April 18, 2026
HomeNewsఅంకితభావం, నిభద్దత, క్రమశిక్షణతో కూడిన పనితనం వల్లనే గుర్తింపు.

అంకితభావం, నిభద్దత, క్రమశిక్షణతో కూడిన పనితనం వల్లనే గుర్తింపు.

జిల్లా కలెక్టర్ టి.నిశాంతి

మండల రెవెన్యూ అధికారులు మండల స్థాయిలో నిరంతరం అందుబాటులో ఉండాలని, ప్రభుత్వం చేపడుతున్న విభిన్న కార్యక్రమాలలో కింది స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణలో క్రమశిక్షణతో కూడిన పనితనంతో వ్యవహరించడం వలన సమస్యలు వేగవంతంగా పరిష్కారం అవుతాయని ఏ ఎస్ ఆర్ జిల్లా కలెక్టర్ టి. నిశాంతి చూచించారు . బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ సిబ్బందితో గత 22 నెలల కాలంలో జిల్లాలో పరిష్కరించబడిన , పెండింగ్ లో ఉన్న రెవెన్యూ సంబంధిత సమస్యలపై ఎజెండాతో 25 అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ అధికారులందరూ అంకుటిత దీక్షతో నిరంతరం కష్టపడి పని చేయడం , ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడం ద్వారా సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని, ప్రతి గ్రామంలో సమస్యలను పరిష్కరించడానికి గ్రామస్థాయిలో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా పెండింగ్ లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించుటకు అవకాశం లభిస్తుందన్నారు. మండల కేంద్రంలో, గ్రామ కార్యాలయాల్లో ఆ మండలానికి గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ భూములు, అటవీ భూములు, జీరాయితీ భూముల తో కూడిన సమగ్ర సమాచారం సమాచారంతో కూడిన రెవెన్యూ మ్యాప్ లను, రికార్డులను సిద్ధం చేసి ఉంచాలన్నారు. గతంలో ఆయా మండలాల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు సిద్ధం చేసి నిరుపయోగంగా ఉన్న భూముల రికార్డులను అందుబాటులో ఉంచాలన్నారు. న్యాయస్థానాల ద్వారా వచ్చే ఆదేశాలను తూచ తప్పకుండా పాటించి నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ప్రజలతో నిరంతరం మమేకం అవడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు వేగవంతంగా లభిస్తాయన్నారు. నిర్దేశించిన గడువులోగా సేవలను అందించడం ద్వారా అభివృద్ధిలో జిల్లా పనితీరు మెరుగు పడుతుందన్నారు. మండల స్థాయిలో, గ్రామస్థాయిలో ఉన్న సిబ్బందికి సమస్యలు పరిష్కరించడానికి జిల్లా అధికార యంత్రాంగం ద్వారా నిర్దేశించిన ప్రణాళికను అందించడం జరుగుతుందని, సిబ్బంది వారి పనితీరును మెరుగుపరుచుకోవడానికి చట్టాలు పైన, నియమ నిబంధన పైన, ప్రభుత్వ జీవోలు పైన, ఉత్తర్వులు పైన స్పష్టమైన మార్గ నిర్దేశకాలు జారీ చేయడంతో పాటు శిక్షణలు అందించడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలలో వచ్చే సమస్యలను సంబంధిత ఫిర్యాదు దారులతో నేరుగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేయడం ద్వారా వేగముగా పరిష్కారం లభిస్తుందన్నారు. రెవిన్యూ సిబ్బంది ఫోన్ కాల్స్ ద్వారా, మెసేజెస్ ద్వారా అర్జీ దారునితో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ సమాచారాన్ని జిల్లా పిజిఆర్ఎస్ సెల్ కు చేరవేయాలన్నారు. ప్రతి శుక్రవారం జిల్లా కేంద్రంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మండల రెవెన్యూ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుటకు జిల్లా స్థాయిలో రెవెన్యూ క్లినిక్ లను ఏర్పాటు చేయడం జరిగిందని మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలకు పరిష్కారం కొరకు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ లలో ప్రజల సంతృప్తి స్థాయి పెంచే విధంగా వారితో మర్యాద పూర్వకంగా వ్యవహరించి సంతృప్తి స్థాయి పెంచే విధముగా చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ లో నిబంధనలకు లోబడి అధికారులు పనిచేయాలన్నారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్స్ గ్రామస్థాయిలో పూర్తి చేసి కుల ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేయాలన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ సకాలంలో పూర్తి చేయాలని, పాసు పుస్తకంలో దొర్లిన తప్పులను సరి చేయాలన్నారు. ప్రతి రెవెన్యూ రికార్డును ఆన్లైన్ నందు పొందుపరచాలని, నూతన గృహ లబ్ధిదారులకు పట్టాలు అందించడానికి లేఅవుట్లలో ఖాళీగా ఉన్న ప్లాట్లను సిద్ధం చేయాలన్నారు. ఆక్రమణకు గురవకుండా ప్రభుత్వ భూములను విధిగా కాపాడాలనీ, రీ సర్వే, మ్యూటేషన్స్ చేసేటప్పుడు పాత రికార్డులను విధిగా తనిఖీ చేయాలన్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారునికి బియ్యం సక్రమంగా అందే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సివిల్ సప్లై అధికారులకు ఆదేశించారు. ప్రతి ఓటరును పోలింగ్ కేంద్రంతో మ్యాపింగ్ చేయాలని, జనగణనను సక్రమంగా నిర్వహించుటకు కింది స్థాయిలో ఏర్పాటు పకడ్బందీగా చేయాలన్నారు. జిల్లాలో రహదారుల అభివృద్ధికి పెండింగ్ లో ఉన్నటువంటి భూ సమీకరణ సమస్యలను ఆయా శాఖల అధికారులతో మాట్లాడి అనుమతులు వేగంగా మంజూరు అయ్యే విధంగా చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీ పూజ, జిల్లా ఇంచార్జ్ డిఆర్ఓ కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నీలకంఠ రావు, పాడేరు ఇంచార్జ్ ఆర్డిఓ ఎంవిఎస్ లోకేశ్వరరావు, కలెక్టరేట్ ఏవో ప్రసాదరావు, ఏ సెక్షన్ సూపరింటెండెంట్ లక్ష్మణరావు, జిల్లా భూ రికార్డులు మరియు సర్వే అధికారి, వివిధ మండలాల నుంచి వచ్చిన మండల రెవెన్యూ అధికారులు, డీటీలు, సర్వేయర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments