Home Devotional శ్రీ పోలమాంబ ఆలయంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం

శ్రీ పోలమాంబ ఆలయంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం

0

శ్రీ పోలమాంబ ఆలయంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం
*సాయంత్రం పవిత్ర గోఖీనది కి నది హారతి కార్యక్రమం

మక్కువ, ( జయజయహే) :-
పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండలం, శంబర గ్రామంలో వేంచేసి ఉన్న ఉత్తరాంధ్రల ఇలవేల్పు శ్రీ పోలమాంబ అమ్మవారి చదురు గుడిలో శనివారం నాడు సహస్ర దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించినట్టు ఆలయ కార్య నిర్వహణ అధికారి బి శ్రీనివాసరావు తెలిపారు. కార్తీక బహుళ ఏకాదశి పర్వదనాన్ని పురస్కరించుకొని శనివారం రాత్రి ఆరు గంటలకు సహస్ర దీపాలంకరణ జరుపనున్నట్లు ఆయన తెలిపారు. తదుపరి పవిత్ర గోముఖినది నందు
నదీహారతులు కార్యక్రమం అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా జరుపనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులు యావన్మంది ఈ బృహత్తర దీపారాధన కార్యక్రమంలో పాల్గొని శ్రీ పోలమాంబ అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందవలసినదిగా వీవో బి శ్రీనివాసరావు కోరుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version