మాడుగుల మండలంలో ఏం గదబూరు జీడి తోటలో సోమవారం జీడు రైతులతో నిరసన తెలిపారు. జీడి పిక్కల పండించే రైతులు గిరిజనులు లక్ష ఎకరాలలో నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాల్లో సాగులో ఉండగా, ప్రధానంగా జీడి పంటను జీవనాధారంగా పండిస్తున్నారు. కేజీ కి 200 రూపాయలు ఇవ్వాలనీ, జీడి తోటల్లో తుప్పలు తొలగించుకోవడం కోసం ఉపాధి హామీలో పని కల్పించాలనీ, జీడి తోటలకు సబ్సిడీ ద్వారా లోన్లు ఇవ్వాలనీ కోరుతున్నారు. నాన్ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ ఆదివాసి గిరిజన సంఘం ఐదవ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా కార్యదర్శి ఇరట నరసింహమూర్తి
ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలుపుతూ జీడిపెక్కల పండించే ప్రతి రైతు ప్రతి ఏడాది తుప్పలు తొలగించడానికి జీడి పిక్కలు కొనుగోలు చేసే షావుకారుల దగ్గర డబ్బు వడ్డి లకు తీసుకొని తెచ్చిన అప్పు తీర్చలేక వడ్డీలు చక్రవడ్డీలవుతూ గిరిజనులకు జీడిపంట కు సరైన ధర లేక చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతున్నారన్నారు.
