Home Politics Andhra Pradesh వన భోజన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

వన భోజన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

0

జ్ఞానాపురం యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక వన భోజన కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు .కార్యక్రమంలో సంక్షేమ సంఘం లో వివాహం అయ్యి, 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పలువురు దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ శ్రీనివాస్ మాట్లాడుతూ వన భోజన కార్యక్రమాల ద్వారా అందరూ కలిసిమెలిసి, ఐకమత్యం తో ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందజేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా విద్యపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పిల్లల భవిష్యత్తుకు అవసరమయ్యే విధంగా విద్యును ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు రవిబాబు, , గ్రామ సంఘం పెద్దలు, ప్రసాద్, నియోజీరావు, మరియదాస్, రాజేష్, ఫ్రాన్సిస్ , కూటమి పెద్దలు టీడీపీ అధ్యక్షులుమధు బాబు , జనసేన అధ్యక్షులు అంతోని శేఖర్ , రాజేష్ పాల్గొన్నారు…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version