టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం గురువారం కొవ్వూరు లోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొవ్వూరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి అంశాలను నాయకులు, కార్యకర్తలకు స్పష్టంగా తెలియజేశారు.
అలాగే రాబోయే రోజుల్లో నిర్వహించబోయే పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. శుక్రవారం తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా ఐక్యతతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో టూమెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బారాయ చౌదరి, కంఠమణి రామకృష్ణ, మద్దిపట్ల శివరామకృష్ణతో పాటు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు ఆళ్ళ హరిబాబు, ఏఎంసీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్, సురేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
