Home Politics Andhra Pradesh 14వేల మెట్రిక్ టన్నుల నిల్వలు

14వేల మెట్రిక్ టన్నుల నిల్వలు

0

ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవు

త్వరలో మరికొన్ని మెట్రిక్ టన్నులు అందుబాటులోకి

ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ

తాజా పరిస్థితిపై ఆర్టీజీఎస్ నుంచి సమీక్ష

ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడింది. భారత్‌లోనూ చాలా రాష్ట్రాల్లో గ్యాస్ లేక హోటల్‌లు, రెస్టారెంట్‌లు మూతపడ్డాయి. ఈ క్రమంలోనే ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రానికి గ్యాస్ సరఫరా అందించే అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారుల సహా పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్, ఓఎన్జీసీ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం సందర్బంగా అధికారులకు సీఎం చంద్రాబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని.. మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రాబోతోందని తెలిపారు. రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవని.. ఆస్పత్రులకు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరతా లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు తక్షణం అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలో మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని.. ఈకేవైసీ, ఓటీపీల ద్వారా గ్యాస్ సిలిండర్ల డైవర్షన్ లేకుండా, ప్రజలు ప్యానిక్ కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్స్ స్టాక్స్ లభ్యత పెరిగేలా చూడాలని..గ్యాస్ కంపెనీలు స్వల్పకాలికంగా ఉత్పత్తి పెంపు, మెరుగైన పంపిణీ జరిగేలా చూడాలన్నారు. రాష్ట్రంలో మరింతగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విస్తరించే అంశంపై దృష్టి సారించాలన్నారు. ఏపీలోని కేజీ బేసిన్ లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును పైప్డ్ నెట్వర్క్ ద్వారా ప్రజలకు సరఫరా చేసేలా చూడాలని.. సీఎన్జీ, పీఎన్జీల వినియోగాన్ని గరిష్టంగా పెంచేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version