Home Uncategorized తితిదే ధార్మిక కార్యక్రమాలు ప్రారంభం

తితిదే ధార్మిక కార్యక్రమాలు ప్రారంభం

0

శ్రీరామనవమి పర్వదినాన్ని పురష్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ ఆధ్వర్యంలో మిడుతూరు మండలం, రోళ్ళపాడు గ్రామంలోని శ్రీరామాలయం నందు ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ధర్మప్రచారకులు కె. సిద్దారెడ్డి శ్రీరామపట్టాభిషేకంపై ఉపన్యసించారు.తదనంతరం స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలను నిర్వహించారు. తితిదే ఇలాంటి కార్యక్రమాలను మారుమూల గ్రామాలలో కూడా ఏర్పాటు చేయడం అభినందనీయమని సర్పంచ్ పేరెడ్డి వేంకట రామిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమాలు మంగళవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉపన్యాసం, స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు, శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. మాజీ సర్పంచ్ నాగారెడ్డి రామస్వామి రెడ్డి, ధర్మప్రచారకులు బొంతు రామ్మోహన్, ధర్మప్రచార మండలి సభ్యులు అంబటి శివశంకర రెడ్డి, విశ్వహిందూ పరిషత్ నాయకులు ఎన్.చిన్న నారాయణ, అర్చకులు టి.మనోహర్ శర్మ, ఇ. వెంకటేశ్వర్లు గౌడు, ఇ. నారాయణ గౌడు, యోగి ఎల్లయ్యతో పాటు భజన మండలి సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version