Home News తొట్టంబేడు మండల అధ్యక్షుడిగా రావిళ్ళ మునిరాజనాయుడు

తొట్టంబేడు మండల అధ్యక్షుడిగా రావిళ్ళ మునిరాజనాయుడు

0

తొట్టంబేడు,: కార్యకర్తలందరూ కష్టపడి పని చేయబట్టి నేను ఎమ్మెల్యే అయ్యా అని శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక టిడిపి పార్టీ కార్యాలయంలో తొట్టంబేడు మండలం టిడిపి పార్టీ అధ్యక్షులుగా రావెళ్ల మునిరాజ నాయుడు, శ్రీకాళహస్తి టిడిపి పట్టణ అధ్యక్షులుగా విజయకుమార్ లు అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వి చ్చేశారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన ఏ ఒక్కరికి అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి తమ వెన్నంటే ఉండి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. గతంలో మండల అధ్యక్షులుగా పనిచేసిన గాలి మురళి నాయుడు ప్రజలకి ఎంతో అందుబాటులో ఉండి సేవ చేశారని కొనియాడారు. బొజ్జల కుటుంబానికి ప్రతి గ్రామంలోనూ మంచి పేరు ఉందని అన్నారు. తమ తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఏ విధంగా పాలన అందించారో ఆ విధంగా పాలన అందిస్తామని అన్నారు.శ్రీకాళహస్తి పట్టణం,తొట్టంబేడు మండలాల పరిధిలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మండల, గ్రామ, వార్డు అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జులు, బూత్ లెవెల్ ఏజెంట్ల ప్రమాణస్వీకారం చేశారు.పార్టీ విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభించేలా బాధ్యతలు కేటాయించామని, అన్ని వర్గాలకూ సమాన ప్రాతినిధ్యం కల్పించామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలం చెందిన టిడిపి నాయకులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version