Home Politics Andhra Pradesh విశ్రమించని ఎన్జీవో నేత రవి శంకర్‌

విశ్రమించని ఎన్జీవో నేత రవి శంకర్‌

0

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్‌జీవోల పాత్ర అసాధారణం. వారి ప్రమేయం లేకుండా ఏ ఆఫీసులోనైనా చిన్న ఫైలు కూడా ప్రిపేర్‌ కాదు. ఫైళ్లను ప్రిపేర్‌ చేయడమే కాదు..వాటిని భద్రపరచడం…అధికారులు సంతకం చేసే ముందు ఈ చిరు ఉద్యోగి రాసిన కామెంట్‌ ఆధారంగానే ఆ ఫైల్‌ రూపుదిద్దుకుంటుంది. దీనికంతటికీ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్‌(ఎన్‌జీఓ) చేసే ప్రక్రియ అంతా ఇంతా కాదు. అలాంటి ఎన్జీవో నాయకత్వానికి సుధీర్ఘ కాలం పాటు సేవలందించడంలో విశాఖకు చెందిన రొంగలి రవి శంకర్‌ అసామాన్య ప్రతిభ కనిబరిచారు. ఉద్యోగి హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా ఎంతటి అధికారులనైనా ఢీ కొట్టే సామర్ధ్యం ఆయన సొంతం. ఎలాంటి లాలూచీ..తెరవెనుక మర్మాలు తెలియని ఆయన తోటి ఉద్యోగుల న్యాయబద్ద కోర్కెలు సాధించడంలో వెన్నుదన్నుగా ఉంటారు. దాదాపు రెండున్నర దశాబ్దాల కాలం పాటు ఆయన ఎన్జీఓ నేతగా సేవలందిస్తున్నారు. విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆయన తెలియని ఉద్యోగులుండరంటే అతిశయోక్తి కాదు. ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ఉపాధ్యక్షునిగా బాద్యతలు చేపట్టారు. రాష్ట్ర కార్యవర్గంలోనే కొనసాగుతున్నా విశాఖ జిల్లాపైనే ఆయన ఫోకస్‌ ఎక్కువగా ఉంటాదని ఉద్యోగులంటున్నారంటే ఆయన ఉద్యోగుల మనస్సులు ఎలా గెలుచుకున్నారో ఊహించుకోవచ్చు.

యూనిట్ నుంచి రాష్ట్ర స్థాయి ప్రస్థానం…!

రొంగలి రవి శంకర్‌ 1991లో దేవరాపల్లి ఆరోగ్య కేంద్రంలో హెల్త్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. ఆ మరుసటి ఏడాదిలోనే ఉద్యోగ సంఘ అన్యాయాల్లో తీవ్రంగా స్పందించడంతో తోటి ఉద్యోగులంతా కె. కోటపాడు యూనిట్‌ కార్యదర్శిగా ఎన్‌జీవో సంఘ బాధ్యతలు అప్పగించారు. అలా దాదాపు 13 ఏళ్ల పాటు అక్కడే ఉద్యోగ సంఘ కార్యకలాపాల్లో పని చేసి ఆ తర్వాత జిల్లా స్థాయిలోనూ…రాష్ట్ర స్ధాయిలోనూ నాయకత్వ పగ్గాలు అందుకున్నారు. అందుకు ఉద్యోగ సంఘ నేతలు పెద్ద ఎత్తున అభినందనలు అందిస్తున్నారు.

జేఏసీలను పటిష్టం చేస్తున్నాం..!

రాష్ట్రంలో ఏపీ ఎన్‌జీవో సంఘం చాలా పటిష్టంగా క్రమశిక్షణతో సంస్థాగతంగా దూసుకుపోతోంది. రాష్ట్ర సంఘం సూచనల మేరకు అన్ని జిల్లాల్లోనూ జేఏసీలను పటిష్టం చేస్తున్నారు. టీచర్స్‌, పెన్సనర్స్‌, ఆర్టీసీ, సొసైటీస్‌, గురుకుల విద్యాలయాలు, ఇలా వివిధ సంస్థలన్నింటినీ జేఏసీలుగా భాగస్వామ్యులవుతున్నారు. ఆ జేఏసీలన్నింటినీ పటిష్టపరచి ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు పోరాటాలు చేస్తాం. విశాఖ జిల్లాలో 8 వేల మంది ఎన్జీవోలు, 15 వేల మంది జేఏసీ సభ్యులున్నారు.

– రవి శంకర్‌ఏపీ ఎన్జీవో ఉపాధ్యక్షులు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version