Home Politics Andhra Pradesh మళ్లీ రామరాజ్యం రావాలి

మళ్లీ రామరాజ్యం రావాలి

0

మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి

రాష్ట్రంలో దుష్ట పరిపాలనకు విముక్తి జరిగి ప్రజలు కోరుకునే విధంగా మళ్లీ రామరాజ్యం రావాలని వైయస్సార్సీపీ సమన్వయకర్త దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు*. 33వ వార్డు అల్లిపురం కుమ్మర వీధిలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని స్వామివారి పల్లకి ఊరేగింపులో భక్తులతో పాటు పల్లకిని ఊరేగించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పని శ్రీరామచంద్రస్వామి రాజ్యంలో ప్రజలను సుఖశాంతులతో జీవించే వారన్నారు. అలాగే వైసిపి ప్రభుత్వం లలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి మడమ తిప్పని ముఖ్యమంత్రిగా ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచి ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని సుపరిపాలనను అందించారని గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వంలో దుష్టసంరక్షణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. 33వ వార్డులో ఘనంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకల్లో తాను కూడా భాగస్వామి అవ్వడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా శ్రీరామ నామ సంకీర్తనతో మార్మోగుతున్నాయన్నారు. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి శ్రీరాముని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు దక్షిణ నియోజకవర్గ ప్రజలకు వాసుపల్లి గణేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 33 వ వార్డు ప్రెసిడెంట్ ముత్తాబత్తుల రమేష్, మాజీ కార్పొరేటర్ పచ్చిరపల్లి రాము,జిల్లా జనరల్ సెక్రటరీ గణగాళ్ల రామరాజు, వార్డు నాయకులు మహిళ నేతలు స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version