Home Politics Andhra Pradesh సిరిమాను, రధానికి నాణ్యత పరీక్షలు

సిరిమాను, రధానికి నాణ్యత పరీక్షలు

0

నాణ్యతా ప్రమాణాలు ప్రకారమే సిరిమాను తయారీ,సిరిమాను పైన పరిమిత సంఖ్యలోనే ఎక్కాలి ,అటవీ, రోడ్ల భవనాలశాఖ అధికారులు వెల్లడి ,శంబర శ్రీ పోలమాంబ అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవానికి సంబంధించి సిరిమాను తో పాటు, రథానికి నాణ్యతా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం శంబర యాత్ర స్థలములో తయారవుతున్న సిరిమాను రోడ్లు భవనాల శాఖ డిప్యూటీ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ ఇంజనీరింగ్ అటవీశాఖ అధికారులు నాణ్యత పరిక్షలకు నిర్వహించారు. అలాగే సిరిమాను రథానికి కూడా నాణ్యత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…సిరిమాను తో పాటు రథం కూడా నాణ్యత ప్రమాణాలు కలిగి ఉందని తెలిపారు. పరిమిత సంఖ్యలో సిరిమానుపై ఎక్కాలని సూచించారు. అమ్మవారి సిరిమాను రథం ఇరిడి కలపతో తయారీ చేయడం వల్ల, నాణ్యత కు ఢోకా లేదని వారు తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version