ఆలయానికి అతి సమీపంలో ఏర్పాటు చేసిన స్పందించని,అధికారులు నివ్వేరపోతున్న గ్రామస్తులు, భక్తులు
*గుడిసె ఏర్పాటుకు సహకరించిన సిబ్బందిని తొలగించాలంటూ డిమాండ్..? రాష్ట్ర గిరిజన జాతరగా గుర్తింపు పొందిన , ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శంబర శ్రీ పోలమాంబ వారి ఆలయ ప్రాంగణంలో ప్రైవేట్ వ్యక్తులు పాగా వేస్తున్నారు. వనం గుడి ప్రాంగణంలో ఆలయానికి అతి సమీపంలో సీసీ రోడ్డున అనుసరించి ప్రైవేట్ వ్యాపారం చేసుకునే వ్యక్తులు ఏకంగా తాటాకు గుడిసెనే నెలకొల్పడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. గుడిసె ఏర్పాటుకు ఆలయంలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగి సహకరించినట్టు పలువురు ఆరోపిస్తున్నారు.? అమ్మవారి వనం గుడి ఆలయం ముందరే తాటాకు గుడిసె ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఆలయ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు దారి తీస్తుంది. సదరు గుడిసెలో జాతర సందర్భంగా అమ్మకాలు జరుపుకునేందుకు కొబ్బరికాయలు, అరటి పండ్లు, వంట సామగ్రితో పాటు మంచం కూడా కలిగి ఉండడం విశేషం.! దీనిని బట్టి పవిత్రమైన శంబర శ్రీ పోలమాంబ అమ్మవారి వనం గుడి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న తతాంగంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయాలను తమ అడ్డాగా మార్చుకొని కొంతమంది ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఇది ప్రత్యేకమైన నిదర్శనం. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఒక ప్రైవేటు వ్యక్తి దర్జాగా గుడిసె ఏర్పాటు చేసుకుంటే.? ఆలయ అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారన్నది బహిరంగ విమర్శ.? ఈ విషయమై సంబంధిత అధికార యంత్రాంగం విచారణ చేపట్టి బాధ్యులైన సిబ్బందిపై కఠినంగా వ్యవహరించుకుంటే.? ఈ పరిణామం మరో విధంగా దారి తీసే అవకాశాలు రాకపోలేదని ఇటు గ్రామస్తులు, అటు పోలమాంబ అమ్మవారి భక్తులు కోరుతున్నారు.
