తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా నూతన కమిటీకి నియామక పత్రాల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు తగరం సురేష్ బాబు నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు.
కార్యక్రమానికి హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ, పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఇచ్చేది బీజేపీ పార్టీనేనని పేర్కొన్నారు. దళిత సోదరుల అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఆ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా నూతన కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు.
అలాగే, ఎస్సీ వర్గాల అభ్యున్నతికి కమిటీ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని, మరింత మంది దళిత యువతను పార్టీ వైపు ఆకర్షించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ బలోపేతానికి కమిటీ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మోర్చా ప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
