Home Politics Andhra Pradesh మన్యాల ఆధ్వర్యంలో శివయ్య భక్తులకు ప్రసాదం వితరణ ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే వంశీకృష్ణ

మన్యాల ఆధ్వర్యంలో శివయ్య భక్తులకు ప్రసాదం వితరణ ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే వంశీకృష్ణ

0

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి శ్రద్ధలతో మహా జాగరణ చేసి సముద్ర స్నానము ఆచరించి వచ్చే భక్తులకు 29వ వార్డు నొవేటల్ హోటల్ ప్రాంతంలో 29వ వార్డు జనసేన సీనియర్ నాయకులు మన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహా ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరై వేలాది మంది భక్తులకు పులిహోర మరియు స్వీట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వంశీ కృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ మన్యాల శ్రీనివాస్ మంచి సేవాతత్పరత కలిగిన నాయకులు అని శివరాత్రి సందర్బంగా జాగరణ చేసిన భక్తులకు ప్రసాదం వితరణ చేసిన మన్యాల శ్రీనివాస్ ఇటువంటి సేవ కార్యక్రమాలు చేసి వార్డు ప్రజల మన్నలను మరియు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. తదనంతరం మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ సుమారు 30,000 మంది భక్తులకు ఈ ప్రసాదం పంపిణీ చేసి అవకాశం రావటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా మరియు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వంశీకృష్ణ అభిమానులు, కూటమి నాయకులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version