Home Politics Andhra Pradesh రజకులకు 50ఏళ్ళకే పెన్షన్

రజకులకు 50ఏళ్ళకే పెన్షన్

0

గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథికి వినతి పత్రం ఇచ్చిన బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ

రజకులకు 50ఏళ్ళకే పెన్షన్ మంజూరు చేయాలని
తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య కోరారు. అలాగే రజకులని ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారథి, ఎమ్మెల్సీ రామారావులకు వినతి పత్రం ఇచ్చారు. అలాగే రజకుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని,
తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎలక్షన్ టైం లో బీసీ డిక్లరేషన్లో రజకుల డిక్లరేషన్ను గుర్తు చేశారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తానని అప్పటి ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ యిచ్చారని పేర్కొన్నారు. రజకులకు రక్షణ చట్టం అమలు చేయాలని, నామినేట్ పోస్టుల్లో రజకులకు ప్రాధాన్యత కల్పించాలని, జీవో నెంబర్ 343 అమలు చేసి, చెరువులు దోబీ ఘాట్లు పై రజకులకే హక్కులు కల్పించాలని, జివో నెంబర్ 27 ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో వాషర్ మెన్ పోస్టులను రజకులతో భర్తీ, తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాలయాలు ఆసుపత్రులు ప్రభుత్వ ఆఫీసుల్లో వస్త్రాలను ఉతికే కాంట్రాక్టులు రజకులకే ఇవ్వాలని, ప్రముఖ దేవాలయాల ట్రస్ట్ బోర్డులో సభ్యత్వం, ధోబిఘాట్ స్థలాలను పరిరక్షణ అండ్ శాశ్వత హక్కులు, లాండ్రీ షాపులు అండ్ దోబి ఘాట్లకు 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తామని మేని ఫెస్టోలో పెట్టిన సీఎం నారా చంద్రబాబు నాయుడుకు గుర్తు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ రాచకొండ నాగేశ్వరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాకినాడ రామారావు, వైస్ ప్రెసిడెంట్ వేంపాటి సాయి, జిల్లా అధికార ప్రతినిధి గడ్డం శ్రీనివాసరావు పలువురు నాయకులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version