Saturday, May 2, 2026
HomeNewsభూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించండి

భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించండి

బాబు జగ్జీవన్ రావ్ సుజల స్రవంతి ప్రాజెక్ట్ భూ సేకరణ లో భాగంగా భూములు కోల్పోయిన నిర్వాసిత రైతులు కు 2013 చట్ట ప్రకారం ఒకటికి నాలుగు రెట్లు నష్టపరిహారం రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ కి బాధితుల తరఫున వినతిపత్రం అంద చేశారు. అనకాపల్లి ఆర్డీవో ఆఫీస్ లో జరిగిన అనకాపల్లి అసెంబ్లీ బడ్జెట్ రీచ్ అవుట్ సమావేశం సందర్భంగా రైతులు వినతిపత్రం రైతు సంఘం నాయకులు పిఎం కిసాన్ జిల్లా కన్వీనర్ పీలా మురళి పీలా కాశీ విశ్వేశ్వరరావు ఆదివారం తెలిపారు ఈ కార్యక్రమంలో శిరస్సుపల్లి రామకృష్ణ ఓట శ్రీనివాసరావు చిన్ని శ్రీనివాస్..ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏలూరు ఛానల్ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషగిరి పీలా గంగ నాగేశ్వరరావు రైతు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ భూ సేకరణ నష్టపోయిన రైతులకు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచి ఉన్నామని త్వరలోనే నిధులు వస్తాయని నిర్వాసిత రైతులుసమస్య పరిష్కరించేందుకు ఈ నెలలో కలెక్టర్ తో మాట్లాడి రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తానని సందర్భంగా సమస్యను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments