Home Politics Andhra Pradesh జెసిఐ ద్వారా సమాజ సేవలో భాగస్వామ్యులు కండి

జెసిఐ ద్వారా సమాజ సేవలో భాగస్వామ్యులు కండి

0

యువతకు జోన్ ప్రెసిడెంట్ వసంతవాడ పిలుపు

జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ (జె.సి.ఐ.) ద్వారా సమాజ సేవా కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యులు కావాలని జె.సి.ఐ. జోన్ ఫోర్ ప్రెసిడెంట్ చైతన్య వసంతవాడ పిలుపునిచ్చారు. వాల్తేర్ క్లబ్ లో జరిగిన జెసిఐ వైజాగ్ పారా అమౌంట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార సభలో వసంతవాడ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పలు శిక్షణా కార్యక్రమాల ద్వారా యువతలో సానుకూల దృక్పథాన్ని ఏర్పరచడంలో జెసిఐ విశేష కృషి చేస్తుందని అన్నారు. అంతర్జాతీయంగా జెసిఐ చేపట్టిన సేవా కార్యక్రమాలను ఆయన వివరించారు. జె.సి.ఐ.
వైజాగ్ పారామౌంట్ నూతన ప్రెసిడెంట్ గా పృథ్విరాజ్ కొండా చేత జె.సి.ఐ. జోన్ 4 కో-ఆర్డినేటర్ ఎ. సాయి నీల్ కమల్ ప్రమాణ స్వీకారం చేయించారు. సెక్రటరీగా నారాయణరావు చెమళ్ళ, ట్రెజరర్ గా భవాని ఇందల బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా ఏర్పడిన జేసిఐ వైజాగ్ ఇన్స్పైర్ శాఖకు అధ్యక్షుడిగా సంతోష్ బంటుపల్లి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు యువతీ యువకులు జెసిఐ సభ్యత్వం పొందారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రసంగికులుగా జోన్ మెంటర్ కె.వి. రావు, గౌరవ అతిథులుగా జోన్ వైస్ ప్రెసిడెంట్లు తన్మయి రామచంద్ర, వి.హకల్య, ప్రత్యేక అతిధులుగా బి. చైతన్య రాజీవ్, శ్రీధర్ కక్కెర్ల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version