Home Politics Andhra Pradesh డిగ్రీ కళాశాలలో పేరెంట్స్, టీచర్స్ సమావేశం

డిగ్రీ కళాశాలలో పేరెంట్స్, టీచర్స్ సమావేశం

0

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం తల్లిదండ్రులు టీచర్స్ సమావేశం నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్ అధ్యక్షత వహించగా, పేరెంట్స్ కమిటీ కోఆర్డినేటర్ ఐ వి వి సత్యవతి ప్రారంభించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ మాట్లాడుతూ ప్రతి తల్లి, ప్రతి తండ్రి వారి పిల్లల చదువు,నడవడిక,ప్రవర్తన పై కనీసం10 నిమిషాలు దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పిల్లల చదువు గురించి ఎల్లప్పుడూ కళాశాలలో ఉన్న అధ్యాపకులు అందుబాటులో ఉంటారని ఎప్పుడైనా వచ్చి వారి ప్రగతిని గురించి తెలుసుకోవచ్చనీ సూచించారు సత్యవతి మాట్లాడుతూ ఇలాంటి సమావేశాలు వల్ల మీ పిల్లల భవిష్యత్తుల గురించి పరిశీలించడానికి అవకాశం కలుగుతుందన్నారు. తల్లిదండ్రుల తరఫున రవి గణేష్ మాట్లాడుతూ ఇలాంటి సమావేశాలు మరిన్ని జరిపి విద్యార్థులు బాగోగులు గురించి తెలియజేయాలని సూచన చేశారు. ఎం గాయత్రి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణ కలిగి,ముఖ్యంగా విద్యార్థినిలు కడు జాగ్రత్త వహించి మెలగాలని తెలియజేశారు. ఐ క్యూ ఏ సి సమన్వయకర్త కళాశాలలో జరుగుతున్న అకాడమిక్ విషయాలన్నీ కూలంకషంగా తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమo లో జాతీయ ఎన్ ఎస్ ఎస్ పి ఓ లు డి.మాల్యాద్రి,బి.పిచ్చమ్మ,కళాశాల అధ్యాపకులు సమన్వయకర్త డాక్టర్ నారాయణ మూర్తి,వి.అప్పలనాయుడు, సిహెచ్ సుధీర్,డాక్టర్ జ్యోతి,డాక్టర్ సంధ్యశ్రీ,డాక్టర్ కృష్ణారావు,డాక్టర్ రాధాకృష్ణ,డాక్టర్ మళ్లీబాబు,శ్రీవెంకటేష్, ఆఫీస్ సూపర్డెంట్ శ్రీనివాసరావు, సరస్వతీ,రామలక్ష్మి,కోమల, కామర్స్ శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version