Home Politics Andhra Pradesh చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు: అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దహనం, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు: అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దహనం, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

0

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యక్తిగతంగా అసభ్య పదజాలంతో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తాళ్లపూడి గ్రామంలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఇతర నాయకులు మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రిపై ఈ స్థాయి వ్యక్తిగత దూషణలు ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదగినవి కావని స్పష్టం చేశారు.
ఈ ఘటన అనంతరం తాళ్లపూడి పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు నమోదు చేసినట్లు తెలిపారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై చేసిన అవమానం కాదని, రాష్ట్ర ప్రజల తీర్పు పట్ల చేసిన అవమానంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టుమెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, జనసేన ఇంచార్జ్ టీవీ రామారావు, మండల టీడీపీ అధ్యక్షులు సిద్ద దుర్గా ప్రసాద్‌తో పాటు నామన పరమేష్, చలపాటి ప్రకాష్, మద్దిపాటి ప్రకాశం, మద్దిపాటి రామారావు, కొటారు వెంకట్రావు, ఉడతా వీరేంద్ర, గెడ్డం జగన్, వీరా హరిబాబు, కైగాల రాంబాబు, ఉప్పులూరి రమేష్, శంకరం తదితర కూటమి నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version