Home News సీఐడీ మాజీ ఎడీజీకి నోటీసులు

సీఐడీ మాజీ ఎడీజీకి నోటీసులు

0
  • సీఐడీ మాజీ ఎడీజీకి నోటీసులు
  • విచారణకు రావాలని పిలుపు
  • గుంటూరు ఎస్పీ దామోదర్ నోటీసు జారీ

(గుంటూరు – జయజయహే)

రఘురామకృష్ణం రాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో సీఐడీ మాజీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు జారీ అయ్యాయి. డిసెంబర్ 4వ తేదీన విచారణకు రావాలని ఎస్పీ దామోదర్ నోటీసులు పంపారు. గుంటూరు సీసీఎస్‌కు రావాలని ఆదేశించారు. ఇప్పటికే ఈ కేసులో అప్పటి దర్యాప్తు అధికారి విజయపాల్, టీడీపీ నేత తులసిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా, అప్పటి సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై రఘురామకృష్ణం రాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2021లో ఆయనపై సీఐడీ అధికారులు దేశద్రోహం కింద కేసు నమోదు చేశారు. ఆ ఏడాది మే 14వ తేదీన రఘురామ జన్మదినం రోజునే ఆయన్ను హైదరాబాద్‌ నుంచి బలవంతంగా గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆరోజు రాత్రి కస్టడీలో తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడినట్లు రఘురామరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత సంవత్సరం జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీసు సేషన్లో కేసు నమోదైంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version