Home News ఏపీపీఎస్సీ అక్రమాలపై విచారణ

ఏపీపీఎస్సీ అక్రమాలపై విచారణ

0
  • స్వతంత్ర కమిటీ విచారణ
  • ఏపీపీఎస్సీ అక్రమాలపై విచారణ బాధ్యతలు
  • రాష్ట్ర హై కోర్టు కీలక నిర్ణయం

(అమరావతి – జయజయహే)

ఏపీపీఎస్సీ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల్లో అక్రమాలను తేల్చే విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ నేతృత్వంలోని స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు హైకోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో జస్టిస్ కేజీ శంకర్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ గంటా రామారావు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ వైస్ చాన్స్‌లర్ ప్రొ. రాజేంద్రప్రసాద్ నియామించింది. హాయ్ ల్యాండ్‌లో జవాబు పత్రాలు మూల్యాంకనం జరిగిందా? ఓఎంఆర్ షీట్లపై మార్కులు నమోదు చేశారా? లేదా అనే విషయంపై అసలు వాస్తవాలు నిర్ధారించాలని ఈ కమిటీకి ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కమిటీ సమక్షంలో జవాబు పత్రాలు, ఓఎంఆర్ షీట్లు పరిశీలించేందుకు ఇరువైపులా న్యాయవాదులకు అనుమతి ఇచ్చింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version