Home Politics Andhra Pradesh యుద్ధాలు వద్దు శాంతి కావాలి

యుద్ధాలు వద్దు శాంతి కావాలి

0

యుద్ధం వద్దు శాంతి కావాలి అని సీఐ టి యు ఆధ్వర్యంలో బుధవారం అనకాపల్లి కూరగాయల మార్కెట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాలపై తన పెత్తనంలో భాగంగా గత పది రోజులుగా ఇజ్రాయిల్ తో కలిసి అమెరికా చేస్తున్న యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా భారతదేశ ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతున్నదని వెంటనే యుద్ధాన్ని ఆపాలని సిఐటి యు జిల్లా అధ్యక్షులు వివి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. యుద్దాల కారణంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడి ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచిందని హోటల్ స్కూల్ గ్యాస్ సరఫరా కుదుంపు వల్ల హోటల్ యాజమాన్యాలకి భయాలు పట్టుకుని హోటల్స్ మూసివేసారని, నిత్యవసర వస్తువులు ధరల పెరుగుదలకు ఈ యుద్ధం భూతం కారణమయ్యేలా ఉందని ఆయిల్, గ్యాస్ నిక్షేపాల కోసం అమెరికా పన్నుతున్న కుట్రలను ప్రపంచ దేశాల్ వ్యతిరేకిస్తున్నాయని, దేశంలో బిజెపి ప్రభుత్వం మాత్రం మౌనం వహించి పరోక్షంగా ఇజ్రాయులకు సహకరిస్తుందని యుద్ధంలో అమెరికా ఇరాన్ లో గల ఆసుపత్రులపై, పాఠశాల పై బాంబులు వర్షం కురిపించి పసిపిల్లల ప్రాణాలు తీస్తున్నారని ఈ యుద్ధం ఆపాలని వారి డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం అమెరికాకు జూనియర్ భాగస్వామిగా వారే చర్యలు విడనాడాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గంట శ్రీరామ్ అనకాపల్లి మండల కన్వీనర్ కాళ్ళ తాలయ్య బాబు, ఏ రాజు, అప్పారావు, నాయుడు, సురేష్, చలపతి, పాపారావు ముఠా కార్మికులు తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version