Home Politics Andhra Pradesh నో టెన్షన్..!

నో టెన్షన్..!

0

చమురు నిల్వలు పూర్తిగా ఉన్నాయి

25 రోజులకు సరిపడా స్టాక్ ఉంది

మరకొంత ఉత్పత్తి రావాణాలో ఉంది

కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా యుద్ధం కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఆదేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని అంతమొందించిన భద్రతా బలగాలు.. ఇంకా దాడుల పరంపరను కంటిన్యూ చేస్తున్నాయి. మరోవైపు ఇరాన్ సైతం తగ్గడం లేదు. ప్రతీకార దాడులతో చెలరేగిపోతోంది. ఇజ్రాయెల్, అమెరికాపై దాడి చేస్తూనే.. ఇరాన్ చుట్టూ ఉన్న వాటి మిత్రదేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైనా విరుచుకుపడుతోంది. దీంతో మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్ర ఉద్రిక్తతలను రేపుతోంది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ సహా మధ్యప్రాచ్య దేశాల నుంచి భారత్ అనేక ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఈ యుద్ధ ప్రభావం భారత్‌పై ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్, గల్ఫ్ కంట్రీస్ నుంచి చమురు, గ్యాస్, విలువైన ఖనిజాలు, ఎలక్ట్రానిక్ గూడ్స్‌ని భారత్ దిగుమతి చేసుకుంటుంది. అయితే, యుద్ధం నేపథ్యంలో ఇరాన్.. రవాణా కేంద్రమైన హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. హార్ముజ్ జలసంధిని మూసి వేయడంతో భారత్‌కు వచ్చే ఆయా ఉత్పత్తుల రవాణా నిలిచిపోయింది. దీంతో మన దేశంలో వీటి ధరలు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారం, వెండి, ఎరువులు, వ్యవసాయ పరికరాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మార్కెట్ వర్గాల అంచనాలు అలా ఉంటే.. ప్రభుత్వ వర్గాలు మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెబుతున్నాయి. ముడి చమురు, గ్యాస్ విషయంలో కంగారుపడాల్సిందేమీ లేదంటున్నారు. ఈ విషయంలో భారత్ కంఫర్ట్ జోన్‌లోనే ఉందంటున్నారు. ‘ముడి చమురు, ఎల్‌పిజి, ఎల్‌ఎన్‌జిల విషయానికొస్తే టెన్షన్ పడాల్సిన పనిలేదు. ప్రస్తుతం 25 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయి. మరో 25 రోజులకు సరిపడా ఉత్పత్తులు రవాణాలో ఉన్నాయి.’ అని ప్రభుత్వ వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version