Home News విష గుళికలు కలిపి ఆహారం తిని తొమ్మిది మేకల మృతి

విష గుళికలు కలిపి ఆహారం తిని తొమ్మిది మేకల మృతి

0

బోరున విలపిస్తున్న మేకల కాపరి కుటుంబం ,మేకలకు విష ఆహారం పెట్టారంటూ ఆరోపణ ,ఆయిల్ పామ్ రైతు పై పోలీసులకు ఫిర్యాదు పోస్ట్ మార్టం చేపడతామంటున్న పశువైద్యాధికారి .పొలంలో మేత కు వెళ్లిన మేకలు విష ఆహారం తిని వరుసగా మరణిస్తుండటంతో మేకల కాపరి కుటుంబం బోరున పిలిపిస్తున్నారు. సమీప ఆయిల్ పామ్ రైతు దురుద్దేశంతోనే ఆహారంలో విషపు గుళికలు కలిపి తమ ఆయిల్ పామ్ పొలిమేరలో ఉంచడంతో మేతకు వెళ్లిన తమ మేకలు తమ ఆయిల్ పామ్ తోటలో విషం కలిపిన మేత మేయడంతో వరుసుగా తొమ్మిది మేకల మృతి చెందాయని ఆరోపిస్తూ బోరు న గెలిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విషపు ఆహారపు గుళికలు పెట్టారన్న అనుమానంతో ఆయిల్ పామ్ రైతు ఈశ్వర రాజు పై మక్కువ పోలీసులు పిర్యాదు చేసినట్టు బాధిత కుటుంబీకులు తెలిపారు. శుక్రవారం నాడు కనుమ రోజున మండలంలో కొండ బుచ్చంపేట గ్రామానికి చెందిన మేకల కాపరి జెర్రీ సుధాకర్ తన మేకలను రోజు లాగానే మేత తోలుకు వెళ్లాడు. పొలం గట్లపై మేస్తున్న మేకలు సమీపంలో ఉన్న ఈశ్వర రాజు ఆయిల్ పామ్ తోటలోకి మేతకు వెళ్లాయని బాధితులు తెలిపాడు. అక్కడ ఉన్న ధాన్యం మేకలు మేస్తున్న సమయంలో విషపు గుళికలు వాసన రావడంతో వెంటనే అప్రమత్తమైన పరిశీలించగా, అక్కడ వేసిన ధాన్యంలో విషపు గుళికలు కలిపి ఉన్న ధాన్యాన్ని తమ మేకలు తిన్నట్టు గుర్తించానని మేకల కాపరి సుధాకర్ తెలిపాడు. అప్రమత్తమైన మేకలను విషపు ఆహారాన్ని తినకుండా ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే మేకలు విషపు ఆహారాన్ని తినడంతో బాధితుడు వెంటనే గ్రామంలోనికి వచ్చి పశువైద్యాధికారును సంప్రదించినట్టు తెలిపారు. పశు వైద్య సిబ్బంది వైద్యం చేసేందుకు వచ్చేలోపే తమ 20 మేకలలో ఐదు మేకలు మృతిచెందాయని బాధితుడు బోరున విలపిస్తున్నాడు. మేకలకు వైద్య సహాయం అందించేందుకు వచ్చిన వైద్య సిబ్బంది విష ఆహారం తిన్నట్లు గుర్తించి వైద్యం చేపట్టారు. అయినప్పటికీ తదుపరి మరో నాలుగు మేకలు మృతి చెందినట్టు బాధితు కుటుంబీకులు తెలిపారు. దీంతో తమ 20 మేకలలో తొమ్మిది మేకలు విషపు ఆహారం తిన్న మూలంగా మృతి చెందడంతో ఆయిల్ పామ్ రైతు ఈశ్వర రాజు దురిద్దేశ పూర్వకంగా విష ఆహారాన్ని చల్లి తన మేకల చనిపోవడానికి కారణమయ్యాడని ఆరోపిస్తూ మేకల కాపరి సుధాకర్ మక్కువ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. విషపు ఆహార శాంపిల్స్ను సచివాలయ పశు వైద్యం సిబ్బంది పరీక్ష నిమిత్తం సేకరించారు. మృతి చెందిన మేకలకు నేడు అనగా మంగళవారంనాడు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నట్టు మక్కువ పశువైద్యాధికారి డాక్టర్ ప్రభాకర్ విలేకరులకు తెలిపారు. తన మేకలు చనిపోవడానికి దురిద్దేశ పూర్వకంగా విషం గుళికలు కలిపిన ఆయిల్ పామ్ రైతు పై చర్యలు తీసుకొని తమకు పరిహారం అందించాలని బాధిత కుటుంబీకులు వేడుకుంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version