Home Politics Andhra Pradesh రూ. 76లక్షలతో కొత్త ఒపీ బ్లాక్

రూ. 76లక్షలతో కొత్త ఒపీ బ్లాక్

0

ప్రభుత్వ నేత్ర వైద్యశాలలో శంఖుస్థాపన
– ఐఓసీ అధికారుల నుంచి పత్రాలు అందుకున్న జేసీ విద్యాధరి

ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్య శాల ప్రాంగణం లో ఒక క్రొత్త ఓపి బ్లాక్ భవన నిర్మాణం ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కార్పొరేట్ ఎన్విరాన్మెంటల్ ఫండ్స్(సి ఈ ఆర్ )ద్వారా రూ. 76 లక్షలను విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ వైజాగ్ టెర్మినల్ అంబటి మహేశ్వర్ రాజు భవన నిర్మాణ పత్రాల్ని అధికారికంగా ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్య శాల సూపరింటెండెంట్ డాక్టర్ వీ మీనాక్షికి అందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి మాట్లాడుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు ప్రభుత్వ హాస్పిటల్స్ కు పేద ప్రజల వైద్యం కోసం సహకారం అందించడం అభినందనీయమని తెలిపారు. డాక్టర్ వి. మీనాక్షి మాట్లాడుతూ ఈ బ్లాక్ ను రెటీనా, గ్లకోమా మరియు కార్నియా స్పెషాలిటీల కోసం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికార ప్రతినిధులు నిశాంత్, బుచ్చయ్య, సాగర్, ప్రాంతీయ నేత్ర శాల ప్రొఫెసర్ లు డాక్టర్ జ్యోతిర్మయి, డాక్టర్ మాధవి, డాక్టర్ ప్రేమలత, ఆర్ ఎం వో డాక్టర్ నవీన్ కుమార్ డాక్టర్ లక్ష్మి ఇతర వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version